1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Badvel By Poll : Congress Candidate name announced

బద్వేల్ బైపోల్ : రేసులోకి కాంగ్రెస్ అభ్యర్థి

Badvel By Poll
కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిని ప్రకటించింది. 
 
మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మ పేరును అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఎఐసిసి) ప్రకటించింది. ఈ మేరకు పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈమె 2009-14లో బద్వేల్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. 
 
2014-17 మధ్య కాలంలో నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ మెంబరుగా ఉన్నారు. ఎఐసిసి మెంబరుగా, ఎపిసిసి కో-ఆర్డినేషన్‌ కమిటీ మెంబరుగా, 2019 రాష్ట్ర ఎలక్షన్‌ మేనిఫెస్టో కమిటీ మెంబరుగా పనిచేశారు. బీజేపీని ప్రశ్నించలేని స్థితిలో వైసిపి ఉందని, అన్యాయాన్ని ప్రశ్నించడానికే బద్వేల్‌లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని శైలజానాథ్‌ ప్రకటించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కుమారుడుకి విషమిచ్చి చంపేసిన తండ్రి.. ఎందుకో తెలుసా?