సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (14:35 IST)

బద్వేలు బైపోల్ : నేడు సీఎం జగన్ సీమీక్ష

ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే నెల 30వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో వైకాపా అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం కడప జిల్లా నేతలతో సమీక్ష జరుపనున్నారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష జరుగనుంది. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, బద్వేలులో వైకాపా తరపున పోటీ చేయనున్న డాక్టర్ సుధలు పాల్గొననున్నారు. ఈ బైపోల్‌కు సంబంధించి పార్టీ శ్రేణులను సమన్వయం చేసే విషయాన్ని పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించే సూచనలు ఉన్నాయి.