గురువారం, 9 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శనివారం, 4 అక్టోబరు 2025 (17:44 IST)

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rakshit Atluri, Komali Prasad and team
Rakshit Atluri, Komali Prasad and team
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం శశివదనే. అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ శనివారం నాడు చిత్రం గురించి చిత్ర యూనిట్ పలు విషయాలు తెలియజేసింది.
 
హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ, సాయి చెప్పిన కథ మొదట్లో నాకు నచ్చలేదు. ఆయనేం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు. కథగా అయితే అర్థం కాలేదు కానీ ఆయన చెప్పిన సీన్లు నచ్చాయి. ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా చూశాను. ఇందులో ఆయన రాసుకున్నట్టుగా ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఇంత వరకు తెలుగులో రాలేదు. శ్రీమాన్ గారు చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. గోదావరి జిల్లాల్ని అద్భుతంగా చూపించిన సాయి కుమార్ పనితనం గురించి అందరూ చెప్పుకుంటారు. అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమాను చేశాం. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆనందంతో బయటకు వస్తారు. ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు అని మాత్రం చెప్పగలను అని అన్నారు.
 
డైరెక్టర్ సాయి మోహన్ మాట్లాడుతూ, సాయి కుమార్‌ నాకు మంచి విజువల్స్ ఇచ్చారు. నేను రాసుకున్న కథను అందమైన పెయింటింగ్‌లా మార్చాడు. శర్వా, అనుదీప్ నాకు మంచి మ్యూజిక్, ఆర్ఆర్ ఇచ్చారు. శ్రీమాన్ చేసిన సింగిల్ షాట్ సీన్ గురించి అందరూ చెప్పుకుంటారు అని అన్నారు. 
 
నిర్మాత అహితేజ మాట్లాడుతూ, ఈ మూవీ ఏ ఒక్కరినీ కూడా నిరాశపర్చదు. అనుభవం లేకపోవడంతోనే రిలీజ్‌లో జాప్యం కలిగింది. కంటెంట్ మీద మా అందరికీ నమ్మకం ఉంది. సినిమా పూర్తి కాకముందే అన్ని రైట్స్ అమ్ముడుపోయాయి. క్లైమాక్స్‌ను నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో ఇంత వరకు చూడలేదు అని అన్నారు.
 
హీరోయిన్ కోమలి ప్రసాద్ మాట్లాడుతూ,  నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నేను ఇందులో పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ టీంలోని చాలా మంది కొత్త వారే. అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. థియేటర్లో అందరినీ మా సినిమా కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తుంది’ అని అన్నారు.
 
కెమెరామెన్ సాయి కుమార్ మాట్లాడుతూ, గత నెలలో నా బ్యూటీ చిత్రం వచ్చింది. కానీ నాకు టెక్నికల్‌గా ఇదే మొదటి చిత్రం. ఈ మూవీలో రాసినట్టుగా ఈ చిత్రం కోసం మేమంతా ఓ యుద్ధం చేశాం. నన్ను మా అహితేజ గారు చాలా నమ్మారు. రక్షిత్ గారు మా అందరికీ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. రక్షిత్‌కి గాయాలైనా కూడా షూటింగ్ కంటిన్యూ చేయడం గ్రేట్. శశి వదనే విజువల్స్ చూసిన తరువాతే నాకు అందరూ అవకాశాన్ని ఇచ్చారు’ అని అన్నారు.