Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్-3. ఈ సినిమా ప్రమోషన్ లో భాగం వైజాగ్ వెళ్ళారు. అక్కడ యువత, అభిమానులనుద్దేశించి మాట్లాడారు. నేను గతంలో ఓ అమ్మాయి ప్రేమ కోసం వైజాగ్ వచ్చేవాడిని. ఇప్పుడు ఆమె నా భార్య అయింది. అందుకే అల్లుడిగా మీ వైజాగ్ వస్తున్నాను. ఇప్పుడూ అలాంటి ప్రేమ వుంది. అందుకే అభిమానులను కలుసుకునేందుకు వచ్చాను. హిట్ 3 సినిమా లో నేను యాక్షన్ బాగా చేశాను.
నానుంచి యాక్షన్ కోరుకునేవారు తప్పకుండా రండి. నానుంచి ప్రేమ సినిమాలు కావాలనుకునేవారు కూడా వచ్చి చూడండి. మీ అందరికీ నచ్చేలా ఈ సినిమా వుంటుంది. నేను భిన్నమైన కథలతో వస్తుంటే మన తెలుగువారు చాలా ఆదరిస్తున్నారు. దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులు అలరించేందుకు సిద్ధమైంది. హిట్ 3 ట్రైలర్ విడుదలైంది. 3 నిమిషాల 32 సెకన్ల ఈ ట్రైలర్ అభిమానులు ఆశించిన స్థాయిలోనే ఉంది. ఉత్కంఠను కలిగించే విధంగా ప్రతి షాట్ సాగింది. దీనికి తోడు తీవ్రమైన యాక్షన్, అండ్ క్రూరమైన విజువల్స్ వున్నాయి.