Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్
Nani new poster
ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న 'HIT: ది 3rd కేస్' మే 1, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు. నాని ఇంటెన్స్ లుక్ లో సిగరెట్ కాలుస్తూ గన్ గురి పెట్టిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో నాని ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్ బోల్డ్ స్టోరీ టెల్లింగ్, నాని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో బజ్‌ను క్రియేట్ చేసింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ని ఈ మూవీ రిడిఫైన్ చేసి ఆడియన్స్ కు నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చేశారు.
