శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (17:50 IST)

కడప నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్ధేందుకు ప్రభుత్వం చర్యలు

ప్రణాళిక బద్దంగా  కడపను అభివృద్ధి చేసి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. మంగళవారం కడప నగరంలోని 28వ డివిజన్ లోని సయ్యద్ సాహెబ్ వీధి పరిధిలో నగర మేయర్ కె.సురేష్ బాబుతో కలిసి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా 14 వ ఆర్థిక సంఘం రూ.28 లక్షల నిధులతో చేపడుతున్న నూతన సీసీ డ్రైన్స్, సీసీ రోడ్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్బంగా ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలన అనంతరం కడప జిల్లా అభివృద్ధి కుంటుపడిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కడప జిల్లాను పూర్తిగా విస్మరించడం జరిగిందన్నారు. మళ్ళీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుండీ, జిల్లా అభివృద్ధి పథంలో దూసుకోపోతుందన్నారు. కడప జిల్లాను, కడప నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కడప నగరాభివృద్ది లో భాగంగా  అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేసి, కడప నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్ధేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.