శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 8 అక్టోబరు 2021 (16:19 IST)

ప్రభుత్వ పనితీరుపై పచ్చ పత్రికల‌ తప్పుడు ప్రచారం: మంత్రి కన్నబాబు

వ్యవసాయమౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల బలోపేతంపై సీఎం పలు ఆదేశాలిచ్చారన్నారు.
 
 ప్రభుత్వ పనితీరుపై పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ప్ర‌బుత్వ చేసే ప్ర‌తి మంచి ప‌నిపైనా వారు బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, అస‌త్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళేలా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.  రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. దళారీలను అరికట్టడానికే భరోసా కేంద్రాలు తీసుకొచ్చామని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం ప్రథమ లక్ష్యమని తెలిపారు.

ఎక్కడా ఎరువుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి రైతు భరోసా కేంద్రం ఇపుడు ఎరువుల‌కు సబ్‌ డీలర్‌గా ఉంటుందన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.