గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: ఆదివారం, 24 అక్టోబరు 2021 (21:14 IST)

ఎన్టీఆర్‌ను పొగడ్తలో ముంచెత్తిన ఉపముఖ్యమంత్రి

వైసీపీ ప్రభుత్వంలో ఉంటూ ముఖ్యమంత్రినే ఏదో ఒకటి మాట్లాడుతూ అడ్డంగా ఇరుక్కుపోవడం నారాయణస్వామికి అలవాటు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఈ విషయాల్లో పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం ఆయన చిక్కుల్లో పడేస్తోంది. ఏది మాట్లాడినా అందులో ఏదో ఒక తప్పు మాట్లాడేసి అడ్డంగా ఇరుక్కుపోతూ ఉంటాడు. అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
 
తాజాగా ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావును పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్టీఆర్ యుగ పురుషుడని.. కనీసం ఎన్టీఆర్‌కు తెలిసినంతగా చంద్రబాబుకు రాజకీయాలు తెలియదని.. వెన్నుపోటు పొడిచే రాజకీయాలే చంద్రబాబు నాయుడుకు తెలుసునంటూ మండిపడ్డారు.
 
కమ్మ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి చంద్రబాబు అంటూ ఆరోపించారు. ఏ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి చంద్రబాబు అని.. ముఖ్యమంత్రిగా ఎన్నేళ్లు పనిచేసిన ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యం అంటూ మండిపడ్డారు.
 
ఇదంతా బాగానే ఉన్నా ఎన్టీఆర్‌ను ఉపముఖ్యమంత్రి పొగడడం ఏమాత్రం వైసీపీ నాయకులకు ఇష్టం లేదట. తెలుగుదేశం పార్టీని స్థాపించిందే నందమూరి తారక రామారావు అని.. అలాంటి వ్యక్తిని పొగడవలసిన అవసరం ఉప ముఖ్యమంత్రికి ఎందుకంటూ ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికైనా అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ చేసి మరీ నారాయణస్వామిని హెచ్చరించారట.