గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , బుధవారం, 1 సెప్టెంబరు 2021 (11:24 IST)

ఎచ్చెర్ల గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల గ్రామ సచివాలయాన్నిఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్ తో కలిసి పలు దస్త్రాలు, సిబ్బంది హాజరు పరిశీలన చేశారు. సచివాలయంలో వివిధ పనుల కోసం వచ్చిన లబ్ధిదారులతో సేవల అందుతున్న తీరును గురించి అడిగి తెలుసుకున్నారు.  
 
తాసిల్దార్ సుధాసాగర్, సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ సంక్షేమ పథకాలపై, జగనన్న కాలనీ ఇండ్ల నిర్మాణం, రీ సర్వే తదితర అంశాల గురించి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నలు వేశారు. గ్రామ సచివాలయం బాగా పనిచేస్తోంది... అంటూ కితాబు ఇచ్చారు. సత్వర సేవలు అందించి సచివాలయంల ఏర్పాటు ద్వారా అనుకున్న  ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని సిబ్బందికి సూచించారు.