చంద్రబాబుకు సవాల్, కాణిపాకంలో ఒట్టేసుకుందామా? డిప్యూటీ సిఎం కంటతడి
తిరుపతిలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కంటతడిపెట్టారు. తనపై లేనిపోని ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దళితుడు కావడంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని.. చంద్రబాబు అండ్ కో పనిగట్టుకుని విమర్సలు చేస్తున్నట్లు డిప్యూటీ సిఎం చెప్పారు.
తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తిరుపతి ప్రెస్ క్లబ్ లోనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు కాణిపాక వరిసిద్ధి వినాయకుని సాక్షిగా ప్రమాణం చేయడానికి కూడా తాను సిద్థమని సవాల్ విసిరారు.
చంద్రబాబుకు దమ్ముంటే కాణిపాకంకు రావాలన్నారు. సమితి అధ్యక్షుడి నుంచి ఉపముఖ్యమంత్రి వరకు ఎన్నో హోదాల్లో పనిచేసిన తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు.
అవినీతికి కేరాఫ్ చంద్రబాబని.. చంద్రబాబు కూడా తనపై విమర్సలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. టిడిపి అండ్ కో తనపై ఆరోపణలు మానుకోవాలంటూ ఉద్వేగానికి లోనైన నారాయణస్వామి కంటతడి పెట్టారు.