బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 19 ఆగస్టు 2021 (20:48 IST)

నేను ఒంటరిని, ఏం చేయను? చంద్రబాబును కలవను: బుచ్చయ్య చౌదరి

ఎపిలో బలంగా ఉన్నది ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగుదేశమేనన్నది విశ్లేషకుల భావన. అయితే ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు చాలామంది ఒక్కొక్కరుగా ఆ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు టిడిపి అధినేతతో పాటు పలువురు ముఖ్య నేతలను విమర్సిస్తున్నారు. 
 
తాజాగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీని వీడాలని వచ్చారట. ఆయన గత కొన్నిరోజులుగా ముబావంగా ఒక్కరే ఉంటున్నారు. తనకు ఎవరూ వద్దని.. తాను పార్టీలో ఒంటరినంటూ బాధపడిపోతున్నారట. 
 
ఇంతలా బుచ్చయ్య చౌదరి నిరాశ చెందడానికి కారణం ఉందటంటున్నారు ఆయన అనుచరులు. ఒక లేఖనే బుచ్చయ్యచౌదరి విడుదల చేశారు. అందులో ఏముందంటే రాజీనామాపై నిర్ణయాన్ని త్వరలో బహిరంగంగానే చెబుతాను. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నిర్వహణలో లోపాలు ఉన్నాయి.
 
నేను చంద్రబాబును కలవను. పార్టీ నేతలే కలుస్తారు. పార్టీలో ప్రస్తుతం నేను ఒంటరివాడినంటూ ఆయన ఒక లేఖను రాశారు. ప్రస్తుతం ఇదే పెద్ద చర్చకు కారణమవుతోంది. ఉన్న సీనియర్లు అందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడితే ప్రతిపక్షపార్టీ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే అవకాశముందన్న అభిప్రాయంలో పార్టీ నేతలు ఉన్నారు.