బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:28 IST)

గోదావరిలో చంద్రబాబు పాదం పెడితే 30 మంది పోయారు.. అనిల్ ఫైర్

గోదావరిలో చంద్రబాబు పాదం పెడితే 30 మంది చనిపోయారని మంత్రి అనిల్‌ కుమార్‌ విమర్శించారు. లోకేష్‌ చేస్తోన్న ట్వీట్లపై అనిల్‌ తీవ్ర స్థాయిలో మండిప్డడారు. టీడీపీ హయాంలో అన్నమయ్య రిజర్వాయర్‌ గేట్లు కొట్టుకుపోయాయని ఫైర్ అయ్యారు. లోకేష్‌ వాడుతున్న పదాలు ఎలాంటివో ఆయనే చెప్పాలని కోరారు. గతంలో పులిచింతలపై వచ్చిన రిపోర్ట్‌ను చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టిందని మంత్రి అనిల్‌ గుర్తు చేశారు. 
 
పులిచింతల కాంట్రాక్టర్‌ టీడీపీ నేత కాదా.. ఆయన దగ్గర చంద్రబాబు లాలూచీ పడి 700 రోజులు కోర్టులో కౌంటర్‌ కూడా వెయ్యలేదని మంత్రి అనిల్‌ కుమార్‌ ఆరోపించారు. ఈ విషయం లోకేష్‌కి తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు పడలేదు.. సీఎం జగన్‌ పాదం పెట్టాకే వానలు పుష్కలంగా పడుతున్నాయన్నారు అనిల్‌ కుమార్‌.