గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 3 ఆగస్టు 2021 (09:31 IST)

వై.ఎస్. బీసీలుగా గుర్తిస్తే, జ‌గ‌న్ కార్పొరేష‌న్ ఇచ్చాడు...

పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీల అమలు చేసే దిశగా సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ తెలిపారు. తాడేపల్లి లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పాల - ఏకరి కార్పొరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.

సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాల ఏకరిలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో బిసిలగా గుర్తించారు అని పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా సీఎం జగన్  పాల ఏకరికి ఓ ప్రత్యేకమైన కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు అని వ్యాఖ్యానించారు.
 
సీఎం జగన్  రాష్ట్రంలో విద్య,వైద్యంలో ఓ వినూత్న విప్లవం తీసుకువచ్చారు అని కొనియాడారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపరేఖలు మార్చారు అని తెలిపారు. అమ్మ ఒడి, విద్య దీవెన, ఫీజు రీంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా ప్రతి పేదవాడి పిల్లలు  విద్య అభ్యసించాలనేది సీఎం లక్ష్యం అని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి తో పాటు పలువురు సమావేశంలో  పాల్గొన్నారు