గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 29 ఏప్రియల్ 2021 (16:10 IST)

Corona second Wave: విద్యార్థుల పరీక్షా సెంటర్లను ప్రకటించిన ఏపీ మంత్రి

కరోనా సెకండ్ వేవ్ విజృంభణ సాగుతోంది. రోజువారీ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఐతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో కూడా తెలిపిన విషయం విదితమే.
 
ఇకపోతే ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ... ఈ ఏడాది ఇంటర్ పరీక్షల కోసం మొత్తం 1452 కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయగా అత్యల్పంగా గుంటూరులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 
కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్టే వేసేందుకు నివారణ చర్యలు తీసుకుంటూనే విద్యార్థుల పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఆర్ఐవోలకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.