సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

జర్నలిస్టుల కోసం ఉచితంగా రెమిడెసివర్ టీకాలు అందజేత

జర్నలిస్టుల కష్టాలపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల కోసం 225 రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఉచితంగా అందజేశారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్టులను తమ వంతు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. 
 
కరోనా పాజిటివ్ గురై ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులకు రెమిడెసివిర్ ఇంజక్షన్‌లను ఉచితంగా అందించనున్నారు. జర్నలిస్టుల కోసం 225 ఇంజెక్షన్లను సిద్ధం చేశారు. 
 
ఆదివారం నెల్లూరు నగరంలో ఒక శాటిలైట్ ఛానల్ కెమెరామెన్ అత్యవసరంగా ఆరు రెమిడిసివేర్ ఇంజెక్షన్లు అవసరం అవడంతో మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయం వెంటనే స్పందించి వాటిని అందజేశారు. 
 
ఆత్మకూరుకి వెళ్లి అభిరామ్ హాస్పిటల్‌లో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఒక ఇంజెక్షన్ బయట అత్యవరమై 30 వేల రూపాయలు పెట్టి కొన్న ఆ కెమెరామెన్‌కు మిగిలిన అయిదు ఇంజక్షన్లు కొనుగోలు చేయడం కష్టతరంగా మారింది. మంత్రి మేకపాటి కార్యాలయాన్ని సంప్రదించగానే వెంటనే వారు స్పందించారు. 
 
మంత్రి మేకపాటి దాతృత్వం మంచి మనసుతో ఉచితంగా అందుకోవడంతో జర్నలిస్ట్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లా జర్నలిస్టులను గుర్తు పెట్టుకుని వారు కష్టకాలంలో ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కార్యాలయ సిబ్బందికి పదేపదే వారిని కాస్త గమనించండి అంటూ తన సందేశాన్ని పంపారు. నెల్లూరు జిల్లాలో మేకపాటి అడుగుజాడల్లో ఆంధ్రలో మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా నడవాలని కోరుకుందాం.