శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (11:23 IST)

భారత్‌లో కరోనా సునామీ.. అండగా ఉంటామన్న సుందర్ - సత్య

భారత్‌లో కరోనా వైరస్ సునామీలా విరుచుకుపడింది. కరోనా రెండో దశ వ్యాప్తి దెబ్బకు భారత్ చిగురుటాకులో వ‌ణుకిపోతోంది. లక్షలాది ప్రజలు ప్రతిరోజూ ఈ వైరస్ బారినపడుతుంటే, వందలాది మంది కళ్ళెదుటే ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాటి క్లిష్ట్ సమయంలో భారత్‌కు అండ‌గా ఉంటామ‌నిగూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు సుందర్ పిచాయ్‌, స‌త్య నాదెళ్ల ప్రకటించారు. 
 
భారత్‌ ప‌రిస్థితిపై ఈ ఇద్ద‌రూ వేర్వేరుగా ట్విటర్‌లో స్పందించారు. ఇప్ప‌టికే గూగుల్‌, గూగుల‌ర్స్ ద్వారా గివ్ ఇండియా పేరుతో యూనిసెఫ్‌కు రూ.135 కోట్ల సాయం చేసిన‌ట్లు సుంద‌ర్ పిచాయ్ ట్వీట్ చేశారు.
 
ఇండియాలో క‌రోనా సృష్టిస్తున్న క‌ల్లోలం తీవ్రంగా క‌లచివేస్తోంది. గూగుల్‌, గూగుల‌ర్స్ ఇప్ప‌టికే గివ్ ఇండియా పేరుతో అత్య‌వ‌స‌ర ఔష‌ధాలు, ఇత‌రాల కోసం యూనిసెఫ్‌కు రూ.135 కోట్లు అందించారు అని సుంద‌ర్ పిచాయ్ ట్వీట్ చేశారు.
 
అటు మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల కూడా ఇండియాకు అవ‌స‌ర‌మైన సాయం అందిస్తామ‌ని ట్వీట్ చేశారు. ఇండియాలో ప‌రిస్థితి హృద‌య విదార‌కంగా ఉంది. ఈ స‌మ‌యంలో ఇండియాకు సాయం చేస్తున్నందుకు యూఎస్ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు.
 
మైక్రోసాఫ్ట్ కూడా స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం త‌న గ‌ళాన్ని, వ‌న‌రుల‌ను, టెక్నాల‌జీని ఉప‌యోగిస్తుంది. ఆక్సిజ‌న్ ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేయ‌డంలో సాయం చేస్తుంది అని స‌త్య నాదెళ్ల ట్వీట్ చేశారు.