1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:18 IST)

అక్రమ మద్యం తరలించడం కొట్టి చంపేంత నేరమా?: సీఎం జగన్‌పై నారా లోకేష్ ఫైర్

ఏపీ సీఎం జగన్‌పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లా భట్రుపాలెంలో పొరుగు రాష్ట్రం నుంచి మద్యం తరలిస్తున్నారన్న ఆరోపణలతో అలీషా అనే మైనారిటీ యువకుడిని పోలీసులు కొట్టి చంపేశారని, గతంలోనూ నంద్యాలలో చేయని నేరానికి దొంగ అనే ముద్ర వేసి వేధించి అబ్దుల్‌ సలామ్‌ కుటుంబాన్ని బలితీసుకున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనల్లో జగన్‌ రెడ్డి, పోలీసుల కర్కశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 
 
అక్రమ మద్యం తరలించడం కొట్టి చంపేంత నేరమా? అని ప్రశ్నించారు. అలాగైతే, విషపూరితమైన సొంత మద్యాన్ని అత్యధిక ధరలకు విక్రయిస్తూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్‌ రెడ్డిది ఇంకెంత పెద్ద నేరమో ఎక్సైజ్‌ పోలీసులు చెప్పాలని నిలదీశారు. అలీషా హంతకులను ఉద్యోగాల నుంచి తొలగించాలని, అలీషా కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వైసిపి సర్కారు దాడుల నుంచి మైనారిటీలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.