1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 జులై 2025 (10:02 IST)

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

Dhanashree Verma
దేశంలో ఎంతగానో ప్రజాదారణం పొందిన బిగ్ బాగ్ 19లో భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్ మాజీ భార్య, యూట్యూబర్ ధనశ్రీ వర్మ పాల్గొననున్నట్టు సమాచారం. అలాగే, హైదరాబాద్ నుంచి ఇద్దరు ఎంపిక కానున్నారనే వార్తలు వస్తున్నాయి. 
 
'బిగ్ బాస్'కు సంబంధించిన ఒక ఇన్‌సైడర్ పేజీలో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. ధనశ్రీ వర్మ 'బిగ్ బాస్ 19’లో పాల్గొనడం దాదాపు నిశ్చయమైనట్టు తెలుస్తోంది. గతంలో ఆమె 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' కోసం కూడా ఎంపికైంది, కానీ ఆ షో రద్దయింది. ఇప్పుడు ధనశ్రీ 'బిగ్ బాస్' ఆఫర్‌ను ఆమె అంగీకరించినట్టు  సమాచారం. 
 
ఈ షోలో ధనశ్రీతో పాటు ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. వీరిలో 'ఇండియన్ ఐడల్ 5' ఫేమ్ గాయకుడు- నటుడు శ్రీరామ చంద్ర కూడా ఉన్నారు. 'బిగ్ బాస్ 19' ఈ ఏడాది అత్యంత ఎక్కువ కాలం నడిచే సీజన్‌గా రికార్డు సృష్టించనుందని, ఆగస్టు చివరి వారంలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
 
కాగా, ధనశ్రీ వర్మ, చాహల్ 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. 2023లో వారి బంధంలో సమస్యలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ఒకరి ఫొటోలను మరొకరు తొలగించడం, ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసుకోవడం వంటి చర్యలతో విడాకుల ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2025 మార్చి 20న ముంబై ఫ్యామిలీ కోర్టు వారి విడాకులను మంజూరు చేసింది.