1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 29 సెప్టెంబరు 2021 (20:34 IST)

జ‌గ‌న్ పై ప్ర‌జ‌లే దాడి చేసే రోజు రాబోతోంద‌ట‌!

ఏపీ ఆబ్కారీ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి నోరు జారారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై త‌ప్పుడు కామెంట్ చేశార‌ని అంద‌రూ నోరు నొక్కుకుంటున్నారు. ఆదేంటంటే... 
 
జగన్మోహన్ రెడ్డి ఏంటంండి దాడి చేసేది... ప్రజలే జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసే రోజు రాబోతుంది...అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అస‌లు ఆయ‌న ఇలా ఎందుకు మాట్టాడారో తెలియ‌క అంద‌రూ త‌ల‌లు బాదుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ప్ర‌జ‌లు దాడి చేయ‌డం అంటే ఎలా? ఎందుకు? అనేది అర్ధం కాక తిక‌మ‌క‌ప‌డుతున్నారు.