గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (16:49 IST)

ప్రేమికుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటానన్నాడు.. అంతే ఆ యువతి?

ప్రేమించిన యువకుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని అంకాపూర్‌కు చెందిన మర్సుకోలు గంగుబాయి (18) జైనథ్ మండలం జామ్నికి చెందిన పెందూర్‌ రవీందర్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
 
ఈ క్రమంలోనే రవీందర్, తాను వేరే యువతిని పెళ్లి చేసుకుంటానని గంగుబాయికి చెప్పాడు. ప్రియుడి మాటకు మనస్తాపం చెందిన గంగుబాయి ఈ నెల 24న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. 
 
గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది గంగుబాయి. తల్లి శోభాబాయి ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.