గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 సెప్టెంబరు 2021 (16:12 IST)

గాయానికి మందు వేసుకుని నిద్రపోయింది, తెల్లారి లేవగానే తనపై రేప్ జరిగినట్లు తెలిసింది

ఆమె ఓ మహిళా అధికారిణి. శిక్షణలో భాగంగా ఆమెకి గాయాలయ్యాయి. దాంతో గాయాలు తగ్గేందుకు మాత్రలు తెచ్చుకుని వాటిని వేసుకుని పడుకుంది. గాఢంగా నిద్ర పట్టేసింది. తెల్లారాక నిద్ర లేచి చూస్తే తనపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకుంది. తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్‌ లైంగిక దాడి చేశాడని ఆ మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ మహిళా అధికారిణిని ట్రైనింగ్‌లో భాగంగా ఆటలు ఆడుతున్న సమయంలో గాయాలయ్యాయి. అవి తగ్గేందుకు మందులు వేసుకుని రాత్రివేళ పడుకుని నిద్రపోయారు. ఐతే నిద్ర లేచి చూస్తే తనపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకుంది. దీనిపై పైఅధికారులకు రెండు వారాల క్రితం ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదంటూ బాధితురాలు ఆరోపిస్తుంది.
 
దీనితో ఆమె స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్ట్ చేసి అతడు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.