బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (15:08 IST)

భర్త చనిపోయాడు, మరొకడితో పెళ్లంటే వద్దన్న పెద్దలు, అంతే కత్తి తీసుకుని...

అహ్మదాబాద్‌కు చెందిన షబానో అనే యువతికి 20 యేళ్ళకే వివాహం చేశారు పెద్దలు. మునవర్ ఖాన్ అనే మటన్ కొట్టు వ్యాపారి ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో అతను గత రెండు నెలల క్రితమే మృతి చెందాడు. 
 
ఈ క్రమంలో ఆ వివాహితతో ఇంటి పక్కనే వున్న సయ్యద్ అనే యువకుడితో కమిట్ అయ్యింది. పెళ్ళి కాకముందే అతనితో శారీరక సంబంధం వుండేది. అతనితోనే జీవితాంతం నడవాలనుకుంది. అయితే పెద్దలు ఒప్పుకోలేదు. సయ్యద్ మంచి వాడు కాదంటూ బంధువులు చెప్పుకొచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి ఇంట్లో నిద్రిస్తున్న తన కుటుంబ సభ్యులపైనే కత్తితో దాడికి దిగింది. 
 
విచక్షణా రహితంగా వారిపై దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు కానీ షబానా మాత్రం కటాకటాల పాలైంది. ప్రియుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.