శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 25 ఆగస్టు 2021 (13:27 IST)

ఆ ఆంటీతో ఎఫైర్ వద్దురా అని ఫ్రెండ్ చెప్పినందుకు ఏం చేసాడో తెలుసా?

వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. ఆంటీతో ఎఫైర్ మానుకోవాలని హెచ్చరించినందుకు స్నేహితుడిపై కత్తితో దాడి చేసాడో యువకుడు.
 
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ సంతోష్ నగర్ పరిధిలో వుంటున్న 23 ఏళ్ల అక్బర్ ఖాన్ రియాసత్ నగర్‌కి చెందిన వివాహితతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ విషయం భర్తకి తెలిసిపోయింది. భార్యను మందలించాడు. కానీ అక్బర్ మాత్రం ఆమెను వదల్లేదు. బయటకు వస్తే చాలు ఆమెను అనుసరిస్తూ వస్తున్నాడు. దీన్ని చూసిన ఆమె భర్త అక్బర్ స్నేహితుడు ఈసాకి ఫోన్ చేసి... నీ స్నేహితుడు ఎక్కువ చేస్తున్నాడు.
 
నా భార్య వెంటపడటం మానుకోవాలనీ, లేదంటే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించాడు. దీనితో ఈసా తన స్నేహితుడికి ఫోన్ చేసి ఆంటీతో ఎఫైర్ కటీఫ్ చేసుకోవాలన్నాడు. ఐతే అక్బర్ స్నేహితుడు మాటలు పట్టించుకోలేదు. యధాప్రకారం ఆ వివాహితతో అవకాశం దొరికితే చాలు ఎఫైర్ సాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత భర్త ఈసారి తీవ్రంగా హెచ్చరించాడు.
 
నీతో పాటు నీ స్నేహితుడిని అంతం చేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో, నాతో ఎందుకు వాడినే అంతం చేసుకో.. నాకేమీ సంబంధం లేదన్నాడు. ఐతే ఆ తర్వాత మనసు ఊరుకోక అక్బర్ కి ఫోన్ చేసి... దయచేసి ఆమెను వదిలెయ్, అంటూ బ్రతిమాలాడాడు. ఐతే అక్బర్ ఎంతకీ ససేమిరా అనడంతో పాటు వాగ్వాదానికి దిగాడు. ఫోన్లో లాభం లేదు నేరుగా వస్తే మాట్లాడుకుందామన్నాడు. ఈసా రాగానే మళ్లీ వాదనకు దిగాడు.
 
కోపంతో అక్కడే వున్న ఓ పైప్ తీసుకుని ఈసాపై దాడి చేసాడు. అదే పైపును లాక్కున్న ఈసా తన స్నేహితుడు అక్బర్ పైన ఎదురుదాడికి దిగాడు. దాంతో తనతో కత్తిని తెచ్చుకున్న అక్బర్ స్నేహితుడు ఈసాపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసాడు. రక్తం మడుగులో పడిపోయిన ఈసాను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.