శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (19:38 IST)

చిన్ననాటి ప్రియురాలిని పెళ్లాడిన క్రికెటర్ సందీప్ శర్మ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీల్లో ఒకటైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన బౌలర్ సందీప్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు తాషా సాత్విక్. ఈమెను గాఢంగా ప్రేమించి సందీప్.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. 
 
కాగా, తాషా సాత్విక్ వృత్తిరీత్యా ఫ్యాషన్, నగల డిజైనర్‌. 2018లోనే వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే, కరోనా వల్ల పెళ్లి వాయిదా పడింది. నవ దంపతులు సందీప్, తాషాలకు సన్ రైజర్స్ హైదరాబాద్ శుభాకాంక్షలు తెలిపింది. 
 
సన్ రైజర్స్‌కు పెళ్లికళ వచ్చిందని చమత్కరిస్తూ ట్వీట్ చేసింది. "మిస్టర్ అండ్ మిసెస్ సందీప్ శర్మ... మీ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం" అని ట్వీట్ చేసింది.