చిరంజీవి గారి ఇంట్లో నాగుపాము పుట్ట.. వనిత విజయకుమార్ ఏమందో తెలుసా? (video)
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో వనిత విజయకుమార్ తమకున్న అనుబంధం ఏమిటో.. ఆలీతో సరదగా ఇంటర్య్యూలో వెల్లడించారు. వనితా విజయ్‌కుమార్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వనిత విజయ్ కుమార్ విషయానికొస్తే.. ఈమె తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్‌గా ఒక వెలిగిన మంజుల కూతురు. ఈమె తండ్రి విజయ్ కుమార్ కూడా తమిళంలో ఒకపుడు అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా దక్షిణాది ఇండస్ట్రీలో ఇప్పటికే నటిస్తున్నారు.
సినీ నటి వనిత విజయ్ కుమార్ పరిచయం గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ఈమె కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పలు భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.
ఇక తన పరిచయాన్ని ఎక్కువగా నటిగా కాకుండా వ్యక్తిగత విషయంలో పెంచుకుంది వనిత. ఇప్పటికే మూడు పెళ్లిళ్లతో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తమిళ పవర్ స్టార్‌ను పెళ్లి చేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.
ఈమె విజయ్ కుమార్, నటి మంజుల పెద్ద కూతురు. ఇక వీళ్ల తల్లిదండ్రులు పెళ్లి తర్వాత మూడేళ్లకు పిల్లలు కలగకపోవడంతో వాళ్ల ఇంటికి దగ్గరలో ఉన్న మరో ఇంట్లో పాముల పుట్ట ఉండేదట. వాళ్ల అమ్మవాళ్లకు ఎవరో చెప్పారట. అక్కడే వుండే కొంత మంది అక్కడే పుట్టలో కొలువైన నాగ దేవతకు ఎన్నో అద్భుత శక్తులున్నాయని.. మొక్కుకుంటే వాళ్ల కోరిక తప్పక తీరుతుందని కూడా చెప్పారట. దీంతో వనిత వాళ్ల అమ్మ మంజుల ఆ పుట్టలోని నాగదేవతకు మొక్కుకున్నారట.
అంతేకాదు పిల్లలు పుడితే.. ఓ గుడి కూడా కట్టిస్తానని కూడా ఆ మొక్కులో ఉందట. ఆ తర్వాత మంజుల, విజయ్ కుమార్ దంపతులకు మొదటి సంతానంగా వనిత పుట్టారు. ఆ తర్వాత మరో ఇద్దరు పుట్టారు. ఇక వనిత తల్లి మంజుల మొక్కుకున్న నాగుపాము పుట్ట ఉన్నది ఎవరింట్లో కాదు.
చిరంజీవి గారి ఇంట్లో. ఆ రకంగా చెన్నైలో ఉన్న చిరంజీవి ఇంట్లో ఉన్న నాగదేవతను మొక్కుకున్న తర్వాత తాను పుట్టానని చెప్పారు. మరోవైపు వనిత ఫ్యామిలీకి మోహన్ బాబు పిల్లలు మంచు విష్ణు, మనోజ్, రవిరాజా పినిశెట్టి పిల్లలు అందరం ఎంతో అల్లరి చేసేవారమంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా పంచుకున్నారు.