సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (08:16 IST)

యూట్యూబ్‌లో చూసి అబార్షన్ చేసుకున్న మహిళ

మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ అతి తెలివి ప్రదర్శించింది. యూట్యూబ్‌లో చూసి అబార్షన్ చేసుకుంది. అది వికటించడంతో ఇపుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ గర్భస్రావం చేసుకోవాలని నిర్ణయించింది. 
 
అయితే, ఆసుపత్రికి వెళ్లకుండా యూట్యూబ్‌లో గర్భస్రావానికి సంబంధించిన వీడియోలు చూస్తూ, అలాగే చేసింది. ఫలితంగా ఆమె ప్రాణాపాయ స్థితిలోకి చేరుకుంది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
 
ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ షోయబ్ ఖాన్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2016 నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని వాపోయింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో యూట్యూబ్ వీడియోలు చూసి గర్భస్రావం చేసుకోవాలని షోయబ్ సూచించాడు. 
 
ఆమె అలాగే చేయడంతో వికటించి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఆమె ఫిర్యాదు నేపథ్యంలో షోయబ్‌ఖాన్‌పై అత్యాచారం సహా పలు అభియోగాల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.