వార్దా నదిలో బోల్తాపడిన పడవ - 11 మంది గల్లంతు
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ జిల్లాలోని గాలేగావ్ సమీపంలో వార్దా నదిలో ఓ పడవ బోల్తా పడింది. దీంతో ఈ పడవలో ప్రయాణిస్తున్న 11 మంది గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ప్రమాద సమయంలో ఆ పడవలో 30కి పైగా మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పడవ మునిగిపోవడాన్ని గుర్తించిన స్థానికులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
అధికారులకు సమాచారం అందించారు. పడవలోని 11 మంది గల్లంతుకాగా ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అధిక బరువు కారణంగానే పడవ మునిగిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.