శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 24 నవంబరు 2021 (20:14 IST)

కేంద్రం నిర్ణయంపై నరసరావుపేట ఎంపీ లావు హర్షం

ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నా యోజన పథకాన్ని మరో 4 నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర కేబినేట్‌ తీసుకున్న నిర్ణయంపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు. 
 
 
లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్నప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు దశలుగా నిర్వహిస్తున్నఈ పథకం నవంబర్‌ 30, 2021 నాటికి ముగుస్తుంది. అయితే, పేద‌ల ప‌రిస్థితుల‌ను అర్ధం చేసుకుని  ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నా యోజన పథకం గడువును  మార్చి 2022 వరకు పొడిగించినందుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు  ఆనందం వ్యక్తం చేశారు.
 
 
ఈ పథకాన్ని 6 నెలలు పొడిగించాలని కోరుతూ సోమవారం దేశ ప్రధానికి ఎంపీగా తాను లేఖ రాసినట్లు లావు  శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి కేంద్ర కేబినేట్‌ ఐదవ దశ నిర్వహణకు రూ.53,344 కోట్లు కేటాయింపులు చేసినందున ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఎంతో మంది దేశ ప్రజానీకానికి ఆహార భద్రత కల్పిస్తుందని అన్నారు. కోవిడ్ వ‌ల్ల గ‌త రెండేళ్ళుగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నార‌ని, ముఖ్యంగా ఆర్ధిక వ్య‌వ‌స్థ ఇంకా అస్త‌వ్య‌స్తంగానే ఉంద‌ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభిప్రాయ‌పడ్డారు.