మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:17 IST)

కట్టుబట్టలతో గెంటేశాడు.. పెళ్లి విలువ అందుకే తెలియలేదు: వనిత విజయకుమార్

సీనియర్ నటుడు విజయ్ కుమార్ కుమార్తె వనితా విజయ్ కుమార్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల ఆమె తమిళ్‌ బిగ్‌బాస్‌ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. బిగ్‌బాస్‌ షో ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన వనితా తాజాగా తన సమస్యలన్నింటినీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడింది. చిన్నతనంలోనే పెళ్లి చేసుకోవడం వల్లే పెళ్లిళ్ల విలువ తనకు తెలియలేదని వనిత పేర్కొంది. అందుకే అవి ఏవీ కూడా నిలవలేదని ఆమె చెప్పింది.
 
తనను కన్నతండ్రే ఇంటి నుంచే బయటకు గెంటేశాడంటూ కన్నీరు పెట్టుకుంది. తన తల్లి మంజుల ఎన్నో కష్టాలుపడి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుందని.. పిల్లల కోసం ఎంతో సంపాదించిందని చెప్పుకొచ్చింది వనిత. 
 
అయితే తన తల్లి సంపాదించిన ఆస్తి ముగ్గురు కూతుర్లకు సమానంగా రావాల్సి ఉండగా... తన తండ్రి తనకు ఒక్క రూపాయి కూడా దక్కకుండా చేశాడని బాధపడింది. అంతేకాదు తన తల్లి మరణించాక తనపై తన తండ్రి చాలా దారుణంగా ప్రవర్తించాడంటూ బాధపడింది. 
 
కట్టుబట్టలతోనే తన పిల్లలతో ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చిందని.. తన తండ్రికి తన మీద ఎందుకంత కోపం ఉందో తనకు అర్థం కావడం లేదంది. తనకు దక్కాల్సిన ఆస్తి కోసం కోర్టు మెట్లు ఎక్కానని వనిత చెప్పుకొచ్చింది.