శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (22:44 IST)

రాజమండ్రిలో బిగ్‌వింగ్‌ను ప్రారంభించిన హోండా 2 వీలర్స్‌ ఇండియా

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఎస్‌ఐ) నేడు తమ గో రైడింగ్‌ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్తూ తమ ప్రీమియం బిగ్‌ బైక్‌ వ్యాపార విభాగం హోండా బిగ్‌వింగ్‌‌ను రాజమండ్రిలో ప్రారంభించింది. 

 
రాజమండ్రిలో బిగ్‌వింగ్‌ ప్రారంభం గురించి శ్రీ యద్వీందర్‌ సింగ్‌ గులేరియా, డైరెక్టర్- సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘హోండా బిగ్‌వింగ్‌ (హోండా యొక్క ప్రత్యేకమైన ప్రీమియం మోటర్‌సైకిల్‌ నెట్‌వర్క్‌)ను వినియోగదారులకు వైవిధ్యమైన లీనమయ్యే అనుభవాలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించాము.

 
నేడు, రాజమండ్రిలో బిగ్‌వింగ్‌ను తెరవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ నూతన ప్రీమియం ఔట్‌లెట్‌ ద్వారా మేము, హోండా యొక్క వినోదాత్మక, ప్రీమియం మోటర్‌సైకిల్స్‌ను రాజమండ్రి లోని వినియోగదారులకు సన్నిహితంగా తీసుకురావడం లక్ష్యంగా చేసుకున్నాం. ఈ నూతన ప్రీమియం ఔట్‌లెట్‌ ద్వారా మా మిడ్‌ సైజ్‌ శ్రేణి మోటర్‌సైకిల్స్‌ను  వారికి మరింత సన్నిహితంగా తీసుకురానున్నాం’’ అని అన్నారు.

 
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా 80 నిర్వహణలోని బిగ్‌వింగ్‌ టచ్‌ పాయింట్స్‌ ద్వారా వైవిధ్యమైన సిల్వర్‌ వింగ్స్‌ అనుభవాలను వినియోగదారులు పొందవచ్చు.