మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (19:03 IST)

ఏపీలో బాగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్ర్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 18,601 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయగా, వీరిలో 1,597 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో అత్యధిక కేసులో తూర్పు గోదావరి జిల్లాలో 478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 220, గుంటూరులో 144, చిత్తూరులో 123, కడపలో 117, విజయనగరం జిల్లాలో 100 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో కేవలం 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదేసమయంలో కరోనా వైరస్ నుంచి 8766 మంది బాధితులు కోలుకున్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుంటే ఏపీలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ బాధితుల సంఖ్య 14,672కు చేరింది. రాష్ట్రంలో 62,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు.