సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (07:28 IST)

బహిరంగ మార్కెట్‌లో "అమ్మకానికి భారత్" : సీపీఎం నేత బీవీ రాఘవులు

గత 70 యేళ్లుగా అభివృద్ధి చేసుకుని సంపాదించుకున్న దేశ సంపదను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. అమ్మానానికి భారతదేశం అనే పేరుతో దేశ సంపదను ప్రైవేటు వ్యక్తులపరం చేసేందుకు ప్రధాని మోడీ కంకణం కట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. 
 
సీఐటీయూ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. క్లియరెన్స్ సేల్ కింద ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశాన్ని అదానీ, అంబానీలకు అమ్మేస్తున్నారని ఆయన విమర్శలించారు. ప్రధాని మోడీ ఏడేళ్ళ పాలనలో దేశప్రజల జీవన ప్రమాణఆలు దారుణంగా పడిపోయాయనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకర స్థాయికి దిగజారిందన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం, కృష్ణపట్నం ఓడరేవులను అమ్మకానికి పెట్టిన ప్రధాని మోడీ ఇపుడు బంగారు బాతువంటి భారతీయ బీమా సంస్థ (ఎల్ఐసి)ని కూడా అమ్మకానికి పెట్టేశారన్నారు. 
 
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతున్నా అడిగే నాథుడే కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి నిధులు ఆగిపోతాయనో, జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో వల్లనో తెలియదుగానీ బీజేపీ నిర్ణయాలను వైకాపా నేతలు సమర్థించడం బాధాకరమన్నారు.