గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (13:35 IST)

విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి

ఏపీలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రోజు రోజుకీ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు టీడీపీ పొలిట్‌బ్యూర్‌ సభ్యులు బోండా ఉమ. 
 
దీని కోసం ఆందోళనకు కూడా సిద్ధం అవుతున్నారు. రేపు ధర్నా చౌక్ వద్ద రంగా పేరు పెట్టాలన్న డిమాండ్‌తో వేలాదిమందితో ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు. అవసరమైతే సీఎం ఇల్లు ముట్టడికి కూడా సిద్ధమన్నారు.
 
వంగవీటి మోహనరంగా విగ్రహం లేని ప్రాంతం లేదన్న ఆయన.. రంగా వంటి మహానేత పేరు పెట్టకపోతే సీఎం వైఎస్‌ జగన్‌ ఆయన్ని అవమానించినట్లే అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్కరు కూడా ఈ డిమాండ్ లపై ఎందుకు మాట్లాడడం లేదు? అని నిలదీశారు.