1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (12:21 IST)

తెలంగాణలో క్యూఆర్ కోడ్ ద్వారా పాఠాలు..

తెలంగాణ ప్రభుత్వం క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్‌ కామన్‌తో అన్ని తరగతుల విద్యార్థులకు అందించనుంది. పాఠాలను చదవడమే కాకుండా వాటిని వీడియో రూపంలో అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 
 
దీనికోసం పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించనుంది. ఆయా పాఠాలకు సంబంధించిన వీడియో లింకును ఈ కోడ్‌లో నిక్షిప్తం చేయనుంది.
 
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి టెక్స్ట్ బుక్స్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పాఠాలను చూడవచ్చు. 
 
ఒకటి నుంచి ఐదో తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలపై ఈ QR కోడ్‌లను ముద్రించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్‌లలో ఈ కోడ్‌లను స్కాన్ చేయవచ్చు.