తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీగా సిమెంట్ ధరలు పెరిగాయి. ఇది పేద ప్రజలకు సొంతింటి కలను దూరం చేయనుంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి రూ.50 వరకు ధర పెరిగినట్టు సిమెంట్ కంపెనీలు ప్రకటించాయి.
ముఖ్యంగా, సిమెంట్ కంపెనీల బ్రాండ్ ఆధారంగా ఈ ధర రూ.310 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. ఈ సిమెంట్ ధరలను పెంచిన కంపెనీల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్ కంపెనీ కూడా ఉంది.
గత యేడాది నవంబరు నెలలో సిమెంట్ డిమాండ్ తక్కువగా ఉండటంతో సిమెంట్ కంపెనీలు ఈ ధరలను రూ.50 నుంచి రూ.70 మేరకు తగ్గించాయి. అయితే, ఈ యేడాది జనవరి నుంచి నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో సిమెంట్ ధరలను పెంచుతూ సిమెంట్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.