శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (14:42 IST)

సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు - ఆరుగురికి రిమాండ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వీటిని పోస్ట్ చేసి షేర్ చేశారు. ఇలాంటి అనుచిత పోస్టులు చేసిన వారిలో ఆరుగురి సైబర్ క్రైమ్ పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే, మరో ఇద్దరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించిన హైదరాబాద్ సనత్ నగర్ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. 
 
గుర్తు తెలియని వ్యక్తి ఒకరు సీఎం కేసీఆర్ ఫోటోను ఎడిట్ చేసి, మార్ఫింగ్ చేసి దాన్ని ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లపాడుకు చెందిన పొన్నెకంటి సురేష్‌, కారేపల్లి మండలం బొక్కల తండాకు చెందిన హట్కర్ రాంబాబులకు పంపాడు. 
 
ఈ ఇమేజ్‌ను రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుల పల్లికి చెందిన జనగంటి అర్జున్‌, పాలమూరు జిల్లా గార్ల మండలం కొత్త పోచారానికి చెందిన కొండమీద కోటేశ్వర రావు, ఖమ్మం జిల్లా తిరమలాయపాలెం మండలం ఏలూరు గూడెం నివాసి నేలమర్రి నారాయణ, పాతర్లపాడు చెందిన నాగేంద్రయ్యలు వివిధ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. వీరందరినీ గుర్తించి అరెస్టు చేశారు.