ఆదివారం, 10 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (12:17 IST)

ఇంటర్​మీడియట్​ బోర్డు వార్షిక పరీక్షల తేదీల ఖరారు

తెలంగాణ ఇంటర్​మీడియట్​ బోర్డు వార్షిక పరీక్షల తేదీలను ఖారారు చేసింది. ఈ మేరకు పరీక్ష షెడ్యూల్​ను విడుదల చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్​ 20 నుంచి మే 2 వరకు జరగనున్నాయని తెలిపింది ఇంటర్ బోర్డు. ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్​ 21 నుంచి మే 5 వరకు జరగనున్నాయని బోర్డు ప్రకటించింది.
 
ప్రాక్టికల్స్ ఎప్పుడంటే..
ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టిల్​ ఎగ్జామ్స్ తేదీలను కూడా ఖరారు చేసింది ఇంటర్ బోర్డు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ఏప్రిల్ 11న మానవ విలువలు, 12న పర్యావరణ శాస్త్రం పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బోర్డు.