1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Rashmika in talks for Vijay's Telugu debut?

విజయ్ సరసన రష్మిక మందన..

Rashmika
గీతగోవిందం హీరోయిన్ రష్మిక మందన బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమె విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్, ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' సినిమా చేస్తున్నాడు. 
 
ఆ తరువాత సినిమాను ఆయన వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకున్నారని అంటున్నారు.
 
ఇక మరో కథానాయికకు కూడా ఛాన్స్ ఉందట. ఆ పాత్రకి పూజ హెగ్డేను తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆల్రెడీ విజయ్‌తో పూజ 'బీస్ట్' సినిమా చేస్తోంది. అందువలన ఆమె ఈ ప్రాజెక్టులో ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
తర్వాతి కథనం
గ్రూపు ఫోటోలో ఎన్టీఆర్ మిస్సింగ్ - దూరం పెట్టేశారా?