గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (17:44 IST)

చిరంజీవి వెంటే ఎన్‌.టి.ఆర్‌, ప్ర‌భాస్‌, మ‌హేష్‌ బాబు, చెప్పిందెవరు?

chiru- Jagan
ప్ర‌స్తుతం తెలుగు సినిమా రంగంలో హాట్ టాపిక్‌గా మారాయి చిరంజీవి కామెంట్స్. గ‌త కొద్దిరోజులుగా ఎ.పి.లో సినిమా టికెట్ల‌ రేట్లు, థియేట‌ర్ల స‌మ‌స్య‌లు వున్నాయి. వాటిపై చ‌ర్చించ‌డానికి వై.ఎస్. జ‌గ‌న్‌తో చిరంజీవి ఇటీవ‌లే భేటీ అయ్యారు. చాలాకాలం ఇండ‌స్ట్రీలో ప‌లువురు ప‌లు ర‌కాలుగా వాదన‌లు వినిపిస్తుండ‌గా ష‌డెన్‌గా చిరంజీవి ఎ.పి. సి.ఎం.తో భేటీ కావ‌డం విశేషం సంత‌రించుకుంది. కానీ స‌మ‌స్య సాల్వ్ కాలేదు. వారం ప‌దిరోజుల్లో సాల్వ్ అవుతుంద‌ని ఆయ‌న మీడియా ముందు చెప్పారు.

 
దీనిపై నిన్న చిత్తూరులో `మా` అధ్య‌క్షుడు మంచు విష్ణు ను విలేక‌రులు అడిగితే.. త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పాడు. ఏ స‌మ‌స్య‌కైనా ఛాంబ‌ర్ వుంది. మేమంతా వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామంటూ క్లారిటీ ఇచ్చాడు. దాంతో రెండు వర్గాలు వున్న ప‌రిశ్ర‌మ మ‌రోసారి హాట్‌టాపిక్‌గా మారింది. 

 
ఈ ప‌రిణామ‌ల‌న్నీ గ‌మ‌నిస్తున్న కొంద‌రు పెద్ద‌లు చిరంజీవి వెంట ప్ర‌ముఖ‌లు వెళ్ళే దిశ‌గా ప్లాన్ చేసిన‌ట్లు తెలిసింది. ఎందుకంటే వారి సినిమాలు కూడా విడుద‌ల ఆగిపోయాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 10 అన‌గా గురువారం నాడు వై.ఎస్‌. జ‌గ‌న్‌తో భేటీకి ర‌మ్మ‌ని ఆహ్వానం చిరంజీవికి అందిన‌ట్లు స‌మాచారం.


ఈ విష‌యం తెలుసుకున్న చిరంజీవితో పాటు రాధేశ్యామ్ నిర్మాత‌లు, ప్ర‌భాస్‌, మ‌హేష్‌బాబు, ఎన్‌.టి.ఆర్‌. కూడా వెళ్ళ‌నున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్‌లో వార్త గుప్ మంది. ఎందుకంటే ఇప్ప‌టికే కాలాతీతం అయింది. ఏ స‌మ‌స్య  వ‌చ్చినా ఎవ‌రికివారే అన్న‌ట్లుగా వున్న ఈ త‌రుణంలో ఇప్పుడు అంద‌రూ క‌లిసి రావాల్సిన అవ‌స‌రం వుంద‌ని సినీ పెద్ద‌లు గ్ర‌హించిన‌ట్లు తెలుస్తోంది.