ఇద్దరూ వాడుకుని వదిలేశారు - కరాటే కళ్యాణి
Karate Kalyani
ఇప్పుడు నేను సింగిల్‌గానే వుంటున్నా. ఇంతవరకు నిజమైన ప్రేమ దొరకలేదు. పెండ్లికి ముందు ప్రేమ అంటూ తిరిగారు. కొద్దిరోజులు కాపురం చేశాక వెళ్ళిపోయారు. ఇది అసలైన ప్రేమకాదు. నాకు సినిమాల్లో ప్రేమ వద్దు. స్వచ్ఛమైన ప్రేమ కావాలి అంటూ చెప్పింది. ఇప్పుడు పిల్లు పెద్దవారు అవుతున్నారు. అందుకే అందరికీ ఆమోదమోగ్యమైన భర్త కోసం ఎదురుచూస్తున్నా. జీవితంలో వైవాహిక జీవితంలో సారాంశం పూర్తిగా అనుభవించలేదని తేల్చిచెబుతోంది. పైగా.. భార్య అంటే వంటింటికి మాత్రమే పనికొచ్చేది కాదు. నేను అందరిలాంటి ఆడపిల్లను కాదు. నేను నిప్పు.. నిప్పును ఎవరైనా ఎంతసేపు పట్టుకోగలరు. అందుకే నా వివాహ జీవితం మధ్యలోనే ఆగిపోయింది. వాళ్ళు వదిలి వెళ్లడంలో నా తప్పు లేదు. అంటూ దనదైన శైలిలో పేర్కొంది.
తర్వాతి కథనం
