శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (16:13 IST)

రాజకీయ నేతలకు ఏమాత్రం తీసిపోని 'మా' సభ్యులు! సరికొత్త ట్విస్ట్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ సంఘం సభ్యులు ఒకరిపై ఒకరు తమదైనశైలిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. దీంతో ఈ ఎన్నికలు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 
 
తాము కూడా ఏమాత్రం రాజకీయ నేతలకు తీసిపోమని చాటిచెప్పేలా ఈ ఎన్నికల్లో పోటీ చేసిన నటీనటుల తీరువుంది. ఒకరుపై ఒకరు తీవ్రమైన విమర్శలు గుప్పించుకుంటున్నారు. 
 
తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నరేశ్, కరాటే కల్యాణిలపై 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నటి హేమ ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తనపై వీరు అసభ్య వ్యాఖ్యలు చేశారని, అసభ్య వ్యాఖ్యలతో కూడిన వీడియోను విడుదల చేశారని లేఖలో తెలిపారు. 
 
తన ఫోటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.  వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, సోషల్ మీడియా లింక్ ను కూడా ఎన్నికల అధికారికి పంపారు. అక్టోబర్ 10న జరగనున్న 'మా' ఎన్నికల్లో నరేశ్, కరాటే కల్యాణిలు ఓటు వేయకుండా నిషేధం విధించాలని కోరారు.