ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:23 IST)

మా ఎన్నికల నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకుంటున్నారా?

మా అసోసియేషన్ ఎన్నికలు ప్రధాన ఎన్నికలను తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా సినీ నటులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సభ్యుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని ఎన్నో కార్యక్రమాలు రూపొందించినట్లు రెండు ప్యానళ్లు స్పష్టం చేస్తున్నాయి.
 
అయితే ఇదంతా బాగానే ఉన్నా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. లోకల్- నాన్ లోకల్ ఇష్యూ కన్నా అసలు ప్రకాష్ రాజ్‌ను పోటీ చేయకుండా ఆపేందుకే విష్ణు ప్యానల్ తీవ్రంగా యత్నం చేస్తున్నారు ఆరోపిస్తున్నారు ప్రకాష్ ప్యానల్.
 
ఈరోజు ఉదయం ఏకంగా 54 మంది సభ్యులకు సంబంధించిన సభ్యత్వాన్ని మంచు విష్ణు మేనేజర్ చెల్లించడం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని విష్ణు రకరకాల ప్రయత్నం చేస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అన్నారు ప్రకాష్ రాజ్.
 
తీవ్రంగా కన్నీటిపర్యంతమైన ప్రకాష్ రాజ్ ఇలా కూడా గెలుస్తారా అంటూ ప్రశ్నించారు. ఇది ఒక గెలుపేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పూర్తిగా ఎన్నికల నుంచి తప్పుకుంటే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నారట ప్రకాష్ రాజ్.
 
ఇలాంటి ఎన్నికలు అవసరంలేదని మొట్టమొదటగా శ్రీకాంత్ చెప్పారట. ఎన్నికల్లో నిలవాలి, గెలవాలే తప్ప అడ్డదారులు తొక్కడం సరైందికాదని.. ఇలాంటివి ఇకనైనా మానుకోవాలని సూచిస్తున్నారట. తాము ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయాన్ని రేపటిలోగా ప్రకాష్ రాజ్ ప్రకటించబోతున్నట్లు ఆ ప్యానల్ లోని కొందరు చెపుతున్నట్లు భోగట్టా.