గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 డిశెంబరు 2021 (16:54 IST)

సినీ నటి కరాటే కళ్యాణిపై కేసు

అత్యాచారానికి గురైన మైనర్ బాలిక వివరాలను సోషల్ మీడియాలో పెట్టారని జగద్గీరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో సినీనటి కళ్యాణిపై కేసు నమోదయ్యింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాధితురాలికి అండగా వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 
 
బాధితురాలి పేరు వివరాలు సోషల్ మీడియాలో పెట్టారని ఆమెపై జగద్గిరిగుట్ట ఏల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన తూటంశెట్టి నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో కరాటే కళ్యాణిపై జగద్గిరిగుట్ట పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.