సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (14:37 IST)

సీఎం జగన్, చిరంజీవి మరోసారి భేటీ.. టాలీవుడ్ సమస్యలపై చర్చ

మె గాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం మరోసారి భేటీ కానున్నారు. చిరంజీవితో పాటు ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంను కలిసే అవకాశం ఉంది. వారంతా ఇండస్ట్రీ సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే టికెట్ల ధరలపై చర్చించనున్నారు.
 
మరోవైపు ఇవాళ (ఫిబ్రవరి 8న) సినీ ప్రముఖులతో చిరంజీవి భేటీ కావాలని భావించినా.. పలువురు ఇండస్ట్రీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో మరోసారి వాయిదా పడింది. ఈ మీటింగ్‌లో సీఎం ముందు ఏ ప్రతిపాదనలు పెట్టాలనే దానిపై చర్చించాలని అనుకున్నారు.
 
ఇండస్ట్రీ సమస్యలపై జనవరి 13న సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఈసారి ఇండస్ట్రీ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ను కలుస్తానని చిరంజీవి ఆరోజే ప్రకటించారు. 
 
అందులో భాగంగా ఏపీలో సినిమా టికెట్ల పంచాయితీకి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు మరోసారి ముఖ్యమంత్రితో చర్చించేందుకు… ఇండస్ట్రీ మనోగతాన్ని తెలియచేసేందుకు మెగాస్టార్ చిరంజీవి మరోసారి సమావేశం కానున్నారు.