శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (17:24 IST)

అగ్రి ఇన్‌ఫ్రా ‌పై ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు

అగ్రి ఇన్‌ఫ్రా పై ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అగ్రి ఇన్ ఫ్రా రంగంపై ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. 
 
రాష్ట్రంలో రానున్న రోజుల్లో వ్యవసాయరంగంలోని మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలన్నారు ఏపీ సీఎం జగన్. అగ్రి ఇన్ ఫ్రా రంగంపై ఆయన సమీక్ష చేశారు.  
 
ఈ సందర్భంగా ప్రభుత్వం దాదాపు రూ.16,320.83 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయలు కల్పించాలన్నారు. 
 
సాధ్యమైనంత త్వరగా వాటిని రైతులకు, అనుబంధ రంగాలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. తద్వారా రైతులకు అదనపు ఆదాయాలు లభించేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో కచ్చితంగా మార్పు కనిపించాలని జగన్ సూచించారు.
 
సేంద్రీయ, సహజ వ్యవసాయం చేయడానికి అవసరమైన యంత్రాలు, పరికరాలు ఏంకావాలో నిర్ణయించి.. ఆ మేరకు ప్రతి ఆర్బీకే స్థాయిలో ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలు జారీ చేశారు.