శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (13:45 IST)

"తలైవా"ను క్రాస్ చేసిన "ఐకాన్ స్టార్"

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ దక్షిణాదిలోని హీరోల అందరికంటే అగ్రస్థానంలో నిలిచారు. ముఖ్యంగా, ట్విటర్‌‍ వంటి సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్ మామూలుగా లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ను క్రాస్ చేశారు. 
 
సాధారణంగా సౌత్‌లో ఒక్క రజనీకాంత్‌కే అత్యధిక ఫాలోయర్ల సంఖ్య ఉంది. ఈయనకు ఏకంగా 6.1 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. కానీ, ఇపుడు అల్లు అర్జున్ ఈ సంఖ్యను క్రాస్ చేశారు. 
 
తాజా గణాంకాల మేరకు అల్లు అర్జున్ ఫాలోయర్ల సంఖ్య 6.5 మిలియన్లను దాటిపోయింది. ఆ తర్వాత మెగాస్టారి చిరంజీవి కేవలం 1.2 మిలియన్ ఫాలోయర్లతో ఉన్నారు. అదేసమయంలో అల్లు అర్జున్ ఒక్కరంటే ఒక్కరిని కూడా ఫాలో కాకపోవడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, అల్లు అర్జున్ నటించిన "పుష్ప" చిత్రం గత యేడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో అల్లు అర్జున్ మార్కెట్‌‍తో పాటు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.