బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (17:12 IST)

హిందీలో 100 కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్

Allu Arjun
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా వచ్చాయి. 300 కోట్ల గ్రాస్ ఈ సినిమా వసూలు చేసింది. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వస్తున్నాయి.  ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు అధికారికంగా తెలియ‌జేశారు. సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలకు, డాన్సులకు చేస్తున్న రీల్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా తగ్గేది లే అంటూ పుష్ప ఫీవర్‌లో ఉన్నారు. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సౌత్ టూ నార్త్ వరకు బన్నీ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది.
 
ఓటిటిలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు ప్రశంసలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమా మరో అద్భుతమైన రికార్డు అందుకుంది. హిందీలో 100 కోట్లు కొల్లగొట్టింది పుష్ప. సైలెంట్‌గా విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఓవైపు కరోనా వైరస్ భయపెడుతున్న కూడా ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించింది పుష్ప. ఉత్తరాది ప్రేక్షకులను మొన్నటి వరకూ యూ ట్యూబ్‌లో ఆకట్టుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు థియేటర్స్‌‌లో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. కేవలం హిందీలో మాత్రమే కాదు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా పుష్ప సంచలన విజయం సాధించింది. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ మొదలు కానుంది. సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.