బాలీవుడ్ హీరోలకు అల్లు అర్జున్ జలక్- వెంకట్
Arjun-venkat
తెలుగులో సినిమాలవైపు బాలీవుడ్ చూస్తోంది. ఇక్కడ హీరోలు చేసే ప్రయోగాలు బాగా నచ్చుతున్నాయి. బాహుబలి సినిమా ఇందుకు బీజం వేసింది. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యారు. పుష్ప వంటి సినిమాలు కూడా ఓటీటీలో చూసి ఆనందిస్తున్నారు. ఆ సినిమాను ముంబైలో బాగా లైక్ చేస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్‌లో ఇప్పటివరకు స్మార్ట్ లుక్ లతో హీరోల కథలు వుండేవి. అవి చూసి జనాలకు బోర్ కొట్టింది. అందుకే మాస్ లుక్‌తో అల్లు అర్జున్ వారికి బాగా నచ్చాడు. అక్కడ ఆయన క్రేజ్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా హీరోలు తమ పాత్రల గురించి ఆలోచించాల్సిన పరిస్తితి వచ్చిందని చెప్పారు.
