బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (11:55 IST)

హీరో రవితేజ చీఫ్ యాక్టర్ ఎందుకు అన్నానో అర్థమైంది : డైరెక్టర్ భార్య

హీరో రవితేజను చీఫ్ యాక్టర్ అంటూ ఓ దర్శకుడు భార్య కామెంట్స్ చేశారు. ఇవి ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె దర్శకుడు రమేష్ వర్మ భార్య రేఖావర్మ. గతంలో ఈమె రవితేజను చీఫ్ యాక్టర్ అంటూ కామెంట్స్ చేశారు. అపుడు రవితేజను చీఫ్ యాక్టర్ అని ఎందుకు అన్నానో ఇపుడు అర్థమైందని చెప్పారు. 
 
ఇదిలావుంటే, రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఇపుడు "ఖిలాడీ" అనే చిత్రం వచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రమేష్ వర్మ భార్య రేఖా వర్మ హీరను ఉద్దేశించి చీఫ్ యాక్టర్ అంటూ కామెంట్స్ చేశారు. రేఖా వర్మ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ఇపుడు సోషల్ మీడియాలో రీడ్ అవుతున్నాయి. 
 
ఇదిలావుంటే ఇటీవల 'ఖిలాడీ' ప్రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో దర్శకుడు రమేష్ వర్మపై హీరో రవితేజ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవి కాస్త సెటైరికల్‌గా ఉన్నప్పటికీ వాటిని దర్శకుడు రమేష్ వర్మ పెద్దగా పట్టించుకోలేదు. అంతా బాగానే ఉన్నట్టు వ్యవహరించారు. కానీ, రవితేజ వ్యాఖ్యలు చూస్తుంటే వారిద్దరి మధ్య కోల్డ్‌వార్ సాగుతున్నట్టు అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో రమేష్ వర్మ భార్య చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.