బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (20:41 IST)

జీపీఎస్ ఆధారంగా భర్తను పట్టుకుంది.. హోటల్‌కు ప్రియురాలితో వెళ్లాడు.. అలా చిక్కాడు..

భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో భార్యకు అనుమానం తలెత్తింది. అంతే 41 ఏళ్ల తన వ్యాపారవేత్త అయిన భర్తను జీపీఎస్ ఆధారంగా పట్టుకుంది. తరచుగా బిజినెస్ టూర్లు అంటూ బయటికి వెళుతున్న భర్త ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు ఆమె సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించింది. భర్త వాహనంలో ఓ జీపీఎస్ పరికరాన్ని రహస్యంగా అమర్చింది. ఇలా బెంగళూరుకు అంటూ మహారాష్ట్ర వెళ్లిన భర్తను పట్టుకుంది.
 
భర్త బస చేసిన హోటల్ సిబ్బంది సాయంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బందికి విజ్ఞప్తి చేసి సీసీటీవీ ఫుటేజి పరిశీలించింది. అందులో భర్త మరో స్త్రీతో కలిసి హోటల్ లోకి వెళుతుండడం కనిపించింది. అంతేకాదు, హోటల్ లో ప్రవేశించే సమయంలో గాళ్ ఫ్రెండ్‌ను భార్య అని చెప్పాడని, అందుకోసం తన ఆధార్ కార్డును తీసుకెళ్లాడని భార్య గుర్తించింది. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 419 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న సదరు వ్యాపారవేత్త, అతడి ప్రేయసి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.